作词 : Chandrabose
作曲 : Yuvanshankar Raja
శివంగి పిల్లా శివంగి పిల్లా సిరాకు పెట్టి సంపకే
సంపంగి పూల సునామిలాగా నా మీద దాడి చేయకే
పీచు మిఠాయి పెదవే అరె పీల్చుతోంది నా ఎదనే
పామల్లే ఊగే నడుమే అరె పెంచెను గుండె దడనే
అరెరెరెరె పొట్టేలు లాంటి పిల్లాన్ని కాలి పట్టీగ మార్చావే
అరె నాటు కొడవలి లాంటి నాతో కూరలు తరిగావే
వదిలేసి వెళ్లకే
నిద్దర రాదే కళ్లకే
శివంగి పిల్లా ఏయ్ ఏయ్
శివంగి పిల్లా ఏయ్ ఏయ్
శివంగి పిల్లా శివంగి పిల్లా సిరాకు పెట్టి సంపకే
సంపంగి పూల సునామిలాగా నా మీద దాడి చేయకే
పైటలో గాలులే పంచెనే శ్వాసలే
నోటిలో మాటలే పాయసం మూటలే
అడుగుల జాడలే హంసల మేడలే
కళ్ళలో కాంతిని అడిగి వెలిగెను చూడే సూర్యుడే
మావూరి సాయబు అత్తరులాగా చొక్కాకు అంటేశావే
అరె కొరమీను చేపల వాసనలాగా బుర్రంత నిండేశావే
వదిలేసి వెళ్లకే ముల్లై మనసును గిల్లకే
శివంగి పిల్లా ఏయ్ ఏయ్
శివంగి పిల్లా ఏయ్
చెప్పని మాటలే కంటికే వినబడే
చెయ్యని చేతలే గుండెకే కనబడే
పొందని అలజడే ఎందుకో అలవడే
చెవులలో దుద్దుల్లాగా హృదయాన్నూపేశావులే
బంగాళదుంపలు బాగా దోచి చెంపల్లో దాచేశావే
అరె పంచ వన్నెల చిలకలు నేసిన పావడ చుట్టేశావే
వదిలేసి వెళ్లకే నాపై పిడుగులు చల్లకే
శివంగి పిల్లా
ఏయ్ శివంగి పిల్లా ఏయ్
శివంగి పిల్లా శివంగి పిల్లా సిరాకు పెట్టి సంపకే
సంపంగి పూల సునామిలాగా నా మీద దాడి చేయకే
శివంగి పిల్లా ఏయ్ ఏయ్
శివంగి పిల్లా
ఏయ్ శివంగి పిల్లా
ఏయ్ శివంగి పిల్లా ఏయ్
ఏయ్ శివంగి పిల్లా