作词 : Ramajogayya Shastry
作曲 : Devi Sri Prasad
సంగీతం : దేవి శ్రీ ప్రసాద్
రచన : రామ జొగయ్య శాస్త్రి
నీ చేపకళ్ళు చేపకళ్ళు గిచ్చుతున్నవే…
నీ కోల కళ్ళు కోల కళ్ళు గుచ్చుతున్నవే…
నా రెండు కళ్ళు రెండు కళ్ళు రెండు కళ్ళు మెచ్చుకున్నవే…
నీ కాలి మువ్వ కాలి మువ్వ ఘల్లుమన్నవే…
నీ కొంటెనవ్వు కొంటెనవ్వు అల్లుకున్నదే…
నా చిట్టిగుండె చిట్టిగుండె చిట్టిగుండె జిల్లుమన్నదే…
చూడకు చూడకు చూపుల మాటకు చెంపల మైదానంలో…
చీటికి మాటికి సిగ్గులు రేపకు వంపుల పూలవనంలో…
అట్టా ఓ ఊపిరిగాలై తాకావో నువ్వు…
నన్నే ఓ మైనపు బొమ్మగ కరింగించేస్తావు…
సూరీడే నువ్వు చురుక్కు అంది అణువణువు…
నీ చేపకళ్ళు చేపకళ్ళు గిచ్చుతున్నవే…
నీ కోల కళ్ళు కోల కళ్ళు గుచ్చుతున్నవే…
నా రెండు కళ్ళు రెండు కళ్ళు మెచ్చుకున్నవే…
నీ కాలి మువ్వ కాలి మువ్వ ఘల్లుమన్నవే…
నీ కొంటెనవ్వు కొంటెనవ్వు అల్లుకున్నదే…
నా చిట్టిగుండె చిట్టిగుండె చిట్టిగుండె జిల్లుమన్నదే…
~ సంగీతం ~
మల్లెపూల వయ్యరమే…
నిన్ను చూసి మందారమై…
కందిపోయెనేడు ఎందుకిల్లా ఈతీగ లాగావని…
బంతిపూల సింగారమే…
రంగు రంగు బంగారమై…
చెంతచేరుకుందీ చేతులారా నాజంట కావాలని…
నీలో ఎడవైపున చోటు నన్నే పిలిచిందీ…
అదిరే కుడివైపున కన్ను ఆహా అంటుందీ…
జోడే కుదిరింది…
నీ చేపకళ్ళు చేపకళ్ళు గిచ్చుతున్నవే…
నీ కోల కళ్ళు కోల కళ్ళు గుచ్చుతున్నవే…
నా రెండు కళ్ళు రెండు కళ్ళు మెచ్చుకున్నవే…
నీ కాలి మువ్వ కాలి మువ్వ ఘల్లుమన్నవే…
నీ కొంటెనవ్వు కొంటెనవ్వు అల్లుకున్నదే…
నా చిట్టిగుండె చిట్టిగుండె చిట్టిగుండె జిల్లుమన్నదే…
~ సంగీతం ~
బుగ్గ చుక్క పెట్టలిగా…
ముద్దు చుక్క పెట్టేయ్యనా…
ఎపుడైతెనే నీ మనస్సు నాసొంతమయ్యిందిలా…
పూలదండ మార్చాలిగా…
కౌగిలింత దండెయ్యనా…
ఎక్కడైతెనే రేపో మాపో కళ్యాణమవుతుందిగా…
అసలే ఇది అల్లరి ఈడు ఆగొద్దంటుందీ…
అవునా నువు ఆమాటంటే నాకూ బాగుంది…
తోడే దొరికింది…
నీ చేపకళ్ళు చేపకళ్ళు గిచ్చుతున్నవే…
నీ కోల కళ్ళు కోల కళ్ళు గుచ్చుతున్నవే…
నా రెండు కళ్ళు రెండు కళ్ళు మెచ్చుకున్నవే…
నీ కాలి మువ్వ కాలి మువ్వ ఘల్లుమన్నవే…
నీ కొంటెనవ్వు కొంటెనవ్వు అల్లుకున్నదే…
నా చిట్టిగుండె చిట్టిగుండె చిట్టిగుండె జిల్లుమన్నదే…